Share News

కరువు మండలంగా ప్రకటించండి

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:20 AM

వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో కొమరాడ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతాంగాన్ని ఆదుకో వాలని సీపీఎం మండల కార్యదర్శి కొల్లి సాంబమూర్తి ప్రభుత్వాన్ని కోరారు.

కరువు మండలంగా ప్రకటించండి
ఎండిన నారుమడిని పరిశీలిస్తున్న సీపీఎం నాయకులు

కొమరాడ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో కొమరాడ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతాంగాన్ని ఆదుకో వాలని సీపీఎం మండల కార్యదర్శి కొల్లి సాంబమూర్తి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం పెద్దశాఖ గ్రామంలో ఎండిన నారుమడుల వద్ద గిరి జన రైతులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వర్షాలు లేక వరి పొలాల్లో ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Aug 31 , 2026 | 12:20 AM