గుర్తు తెలియని యువకుడి మృతి
ABN , Publish Date - Jul 11 , 2026 | 12:15 AM
ఎస్.కోట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గుర్తు తెలియని యువకుడు అనుమా నాస్పదంగా మృతిచెందాడు.
శృంగవరపుకోట, జూలై 10(ఆంధ్రజ్యోతి): ఎస్.కోట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గుర్తు తెలియని యువకుడు అనుమా నాస్పదంగా మృతిచెందాడు. శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీసులు ఈ మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిపారు. నలుపు, తెలుపు గడులు కలిగిన ఎరుపు రంగు షర్ట్, నీలం రంగు జీన్ ఫ్యాంటు ధరించాడని చెప్పారు. ఎవరైనా గుర్తుపడితే 9121109448 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని సీఐ వి.నారాయణమూర్తి కోరారు.