ఉపాధి వేతనదారుడి మృతి
ABN , Publish Date - May 26 , 2026 | 11:50 PM
మండలంలోని పొల్లంకి గ్రామంలో మంగ ళవారం ఉదయం ఉపాధి హామీ పనిచేస్తుండగా సిరువూరి సన్యాసిరాజు(65) అనే వ్యక్తి మృతిచెందారు.
గంట్యాడ, మే 26(ఆంధ్రజ్యోతి): మండలంలోని పొల్లంకి గ్రామంలో మంగ ళవారం ఉదయం ఉపాధి హామీ పనిచేస్తుండగా సిరువూరి సన్యాసిరాజు(65) అనే వ్యక్తి మృతిచెందారు. ఉపాధి హామీ ఏపీవో సుందరరావు తెలిపిన వివరా లు ఇలా ఉన్నాయి. గ్రామంలో కర్రివారి చెరువు వద్ద అందరితో పాటు సిరు వూరి సన్యాసిరాజు పనిచేస్తుండగా ఒక్కసారిగా పనిచేసే చోట కుప్పకూలి పడిపోయారు. వెంటనే కూలీలు 108కు సమాచారం అందించారు. దీంతో 108 వాహన సిబ్బంది వచ్చి.. సన్యాసిరావును పరీక్షించారు. అప్పటికే సన్యాసిరావు మృతిచెందినట్టు వారు నిర్ధారించారు. అయితే సన్యాసిరావు గుండెపోటుతో మృతిచెందారా.. వడదెబ్బకు చనిపోయారా.. అనేది తెలియలేదు. వెంటనే ఎంపీడీవో రమణమూర్తి, ఏపీవో సుందరరావు, సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి సన్యాసిరాజు మృతదేహానికి నివాళులర్పించారు.