Share News

ఉపాధి కూలీ మృతి

ABN , Publish Date - Feb 15 , 2026 | 12:09 AM

మండలంలోని కలవచర్ల గ్రా మానికి చెందిన ఉపాధి కూలీ రౌతు వెంకటరమణ(60) శనివారం మధ్యాహ్నం మృతిచెందాడు.

ఉపాధి కూలీ మృతి

గుర్ల, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): మండలంలోని కలవచర్ల గ్రా మానికి చెందిన ఉపాధి కూలీ రౌతు వెంకటరమణ(60) శనివారం మధ్యాహ్నం మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. వెంకటరమణ ఎప్పటిలాగే శనివారం ఉదయం ఉపాధి పని కోసం గ్రామంలోని చెరువుకు వెళ్లాడు. పనిచేస్తుండగా ఒక్కసారిగా గుండెల్లో నొప్పి వచ్చింది. తోటి కూలీలకు చెప్పాడు. అదే సమయంలో ఒక్కసారి గా కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో తోటి వేతనదారులు వెంట నే ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పడంతో ఇంటి వద్దకు వచ్చి, కుప్పకూలిపోయాడు. వెంటనే దగ్గరలో ఉన్న వైద్యుడిని పిలిపించారు. అయితే అప్పటికే మృతిచెంది నట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు సంబంధిత అధికారులకు తెలియజేశారు. మృతుడికి భార్య మంగమ్మ ఉంది.

Updated Date - Feb 15 , 2026 | 12:09 AM