Share News

Dead body in the bushes ముళ్లపొదల్లో మృతదేహం

ABN , Publish Date - May 05 , 2026 | 12:23 AM

Dead body in the bushes చెరువు వద్ద.. ముళ్ల పొదల్లో.. ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. శరీరంపై రక్తపు గాయాలు ఉన్నాయి. ఈ ఘటన ఆమె ఇంటికి సమీపంలోనే జరిగింది. ఇంటి తలుపులు పగలగొట్టి ఉన్నాయి. బీరువా బార్లా తెరిచే ఉంది. 15 ఏళ్ల కొడుకు కనిపించలేదు. ఆమెను ఎవరైనా హత్య చేసి అక్కడ పడేశారా? పోలీసులైతే ఇలానే అనుమానిస్తున్నారు. ఈ దిశగానే దర్యాప్తు మొదలు పెట్టారు. రాజాంలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది.

Dead body in the bushes ముళ్లపొదల్లో మృతదేహం
స్పందన (ఫైల్‌)

ముళ్లపొదల్లో మృతదేహం

వివాహిత అనుమానాస్పద మృతి

ఇంటికి సమీపంలోనే చెరువు వద్ద..

శరీరంపై అక్కడక్కడా రక్తపు గాయాలు

కనిపించని 15 ఏళ్ల ఆమె కుమారుడు

రంగంలోకి దిగిన క్లూస్‌ టీం

హత్య కోణంలో పోలీసుల దర్యాప్తు

చెరువు వద్ద.. ముళ్ల పొదల్లో.. ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. శరీరంపై రక్తపు గాయాలు ఉన్నాయి. ఈ ఘటన ఆమె ఇంటికి సమీపంలోనే జరిగింది. ఇంటి తలుపులు పగలగొట్టి ఉన్నాయి. బీరువా బార్లా తెరిచే ఉంది. 15 ఏళ్ల కొడుకు కనిపించలేదు. ఆమెను ఎవరైనా హత్య చేసి అక్కడ పడేశారా? పోలీసులైతే ఇలానే అనుమానిస్తున్నారు. ఈ దిశగానే దర్యాప్తు మొదలు పెట్టారు. రాజాంలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది.

రాజాం రూరల్‌, మే 4(ఆంధ్రజ్యోతి): రాజాం మున్సిపాలిటీ పరిధిలోని డోలపేటకు చెందిన సతీష్‌ ఫొటోగ్రాఫర్‌గా ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. భార్య స్పందన (35), కుమారుడు శశాంక్‌తో జీవిస్తున్నాడు, సోమవారం ఉదయం విధులకు వెళ్లిన సతీష్‌ సాయంత్రం 5 గంటల తరువాత ఇంటికి వచ్చారు. భార్య ఇంట్లో లేకపోవడంతో ఆరా తీశారు. వెతికే క్రమంలో ఇంటి సమీపంలోనే చెరువు వద్ద ముళ్లపొదల మద్య స్పందన విగతజీవిగా పడి ఉండడాన్ని గమనించారు. స్థానికుల సాయంతో ఆమె మృతదేహాన్ని బయటకు తెచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాజాం ఇన్‌చార్జి సీఐ శ్రీనివాసరావు సారథ్యంలోని సిబ్బంది, క్లూస్‌టీం సభ్యులు ఘటనా స్థలానికి చేరకున్నారు. ఇంటి లోపల, బయటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారితో మాట్లాడి వివరాలు సేకరించారు. భార్య మృతి చెందిందన్న ఆందోళనలో ఉన్న సతీష్‌ రాత్రి 8 గంటల సమయంలో 15 ఏళ్ల కొడుకు శశాంక్‌ కూడా కనిపించడం లేదని గుర్తించారు. దీంతో సతీష్‌తో పాటు కుటుంబ సభ్యులలో మరింత ఆందోళన నెలకొంది.

ఇది హత్యేనా?

స్పందనను ఎవరైనా హత్య చేశారా? పోలీసులు అనుమానాల్లో ఇది కూడా ఒకటి. ఎలాంటి వివాదాలు లేకుండా జీవితం గడుపుతున్న స్పందన ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆత్మహత్య అయితే శరీరంపై రక్తంతో కూడిన గాయాలు ఎలా వచ్చాయన్న ప్రశ్న తలెత్తుతోంది. అలాకాకుండా స్పందనను ఎరవైనా హత్య చేస్తే ఎందుకు చేశారనే కోణంలో కూడా పొలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సతీష్‌ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడం, ఇంట్లోని బీరువా సైతం తెరిచి ఉండడం వంటివి స్పందన హత్యకు గురైందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే నిజానిజాలు పొలీసుల దర్యాప్తులో తేలనుంది.

శశాంక్‌ ఎక్కడ..?

ఇటీవల వెలువడిన పదోతరగతి ఫలితాలలో ఉత్తీర్ణుడైన శశాంక్‌ కనిపించక పోవడంతో ఆ కుటుంబంలో మరింత ఆందోళన నెలకొంది. పది పాస్‌ అయిన శశాంక్‌ ఇటీవల స్నేహితులకు పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం కూడా ఓ స్నేహితుడ్ని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చినట్లు సమాచారం.

Updated Date - May 05 , 2026 | 12:23 AM