Share News

వీఆర్వోల గైర్హాజరుపై డీడీవో ఆగ్రహం

ABN , Publish Date - Sep 01 , 2026 | 12:29 AM

మండ లంలోని అరసాడ, బాగెమ్మపేట, శ్రీహరిపు రం, మడ్డువలస గ్రామాల్లోని సచివాలయం లో వీఆర్వోలు అందుబాటులో లేకపోవటం తో డీడీవో ప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీఆర్వోల గైర్హాజరుపై డీడీవో ఆగ్రహం

  • నివేదికలు ఇవ్వాలని తహసీల్దార్‌కు లేఖ

వంగర , ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): మండ లంలోని అరసాడ, బాగెమ్మపేట, శ్రీహరిపు రం, మడ్డువలస గ్రామాల్లోని సచివాలయం లో వీఆర్వోలు అందుబాటులో లేకపోవటం తో డీడీవో ప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా గ్రామ సచివాలయానికి చేరుకు న్న డీడీవో.. సిబ్బంది బయోమెట్రిక్‌, అటెం డెన్సు పద్ధతి క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీ ల సమయంలో ఏ గ్రామంలో వీఆర్వో లేకపో వడంతో పాటు గతంలో కూడా హాజరు అస్త వ్యస్తంగా ఉన్నట్టు గుర్తించారు. వీఆర్వోలు అసలు విధులకు హాజరవుతున్నారా అని ఆయన సిబ్బందిని ప్రశ్నించారు. సిబ్బంది మౌనంగా ఉండటంతో ఆయన తహసీల్దార్‌ రామారావుకు లేఖ రాశారు. తక్షణమే దర్యాప్తు చేసి, వీఆర్వోల పనితీరుపై నివేదికలు అందజేయాలని ఆదేశిం చారు. అనంతరం గ్రామీణ సేవల ప్రగతిపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ప్రజా భిప్రాయ సేకరణ రిజిష్టర్‌ డిజిటలైజేషన్‌ అప్‌డేట్‌గా ఉండాలన్నారు. రెవెన్యూ సిబ్బంది తీరు అస్తవ్యస్తంగా ఉండటంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

Updated Date - Sep 01 , 2026 | 12:29 AM