రెండో రోజు.. అదే ఉత్సాహం
ABN , Publish Date - Nov 23 , 2026 | 12:03 AM
Day Two… The Same Enthusiasm పాలకొండలో రెండో రోజు ఆదివారం 70వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కూల్ గేమ్స్ కరాటే పోటీలు ఆద్యంతం ఉత్కంఠగా సాగాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు అండర్ 14, 17, 19 విభాగాల్లోని వివిధ కేటగిరీల్లో తలపడి పతకాలు సాధించారు.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన పలువురు క్రీడాకారులు
పాలకొండ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పాలకొండలో రెండో రోజు ఆదివారం 70వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కూల్ గేమ్స్ కరాటే పోటీలు ఆద్యంతం ఉత్కంఠగా సాగాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు అండర్ 14, 17, 19 విభాగాల్లోని వివిధ కేటగిరీల్లో తలపడి పతకాలు సాధించారు. ఏపీ టెక్నికల్ డైరెక్టర్ రాజు ఆధ్వర్యంలో ఈ కరాటే పోటీలు జరిగాయి. ఒక్కో కేటగిరీ నుంచి నలుగురు చొప్పున క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. అండర్ 14, 17, 19 విభాగంలో 132 మంది బాలికలను ఎంపికయ్యారు. బాలురు విభాగం నుంచి మూడు కేటగిరీల్లో 156 మంది క్రీడాకారులు జాతీయస్థాయికి ఎంపిక చేశారు. ఈ పోటీలు భోపాల్, పంజాబ్‌లలో జరగనున్నాయి.
విజేతలు వీరే...
అండర్ -19 బాలురు మైనస్-45 (బరువు) కేజీల విభాగంలో విశాఖ వాసి వి.వివేక్ బంగారు పతకం సాధించగా, కర్నూలుకు చెందిన ఎ.ప్రణీత్ సిల్వర్ మెడల్, చిత్తూరుకు చెందిన పి.చైతన్య బ్రాంజ్ మెడల్ సాధించారు. అండర్-19 బాలురు మైనస్-66 విభాగంలో కర్నూలుకు చెందిన సిహెచ్.షన్ముఖసాయి గోల్డ్ మెడల్ సాధించగా, వైజాగ్‌కు చెందిన యశ్విన్ సిల్వర్ మెడల్, వెస్ట్ గోదావరి వాసి బి.జస్వంత్ బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నారు. అండర్-17 బాలురు మైనస్-70 విభాగంలో కర్నూలుకు చెందిన సాయిదినేష్ గోల్డ్‌మెడల్, వైజాగ్ వాసి మనోహర్ ప్రకాష్ సిల్వర్, చిత్తూరుకు చెందిన వి క్రమాదిత్య బ్రాంజ్ మెడల్ సాధించారు. అండర్-17 బాలురు మైనస్-75 విభాగంలో అనంతపురానికి చెందిన ఎం.ఎస్.రథీమ్ గోల్డ్ మెడల్, శ్రీకాకుళం వాసి పి.అశోక్ సిల్వర్, కర్నూలుకు చెందిన వై.విష్ణు బ్రాంజ్ మెడల్ సాధించారు. క్రీడాకారులకు డిప్యూటీ డీఈవో కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మెడల్స్‌ను అందించారు.