Annadanam at Another దర్శనం ఒక చోట.. అన్నసమారాధన మరోచోట
ABN , Publish Date - Jun 27 , 2026 | 11:47 PM
Darshan at One Place, Annadanam at Another ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామసామి దేవస్థానాలకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత.. కిలోమీటరు దూరంలో మరోచోట అన్నసమారాధనకు వెళ్లాల్సి వస్తోంది.
అన్నదానం నిలిపివేతతో ఇక్కట్లు
భక్తుల ఆకలి తీరుస్తున్న గ్రామస్థులు
గరుగుబిల్లి, జూన్27(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామసామి దేవస్థానాలకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత.. కిలోమీటరు దూరంలో మరోచోట అన్నసమారాధనకు వెళ్లాల్సి వస్తోంది. ప్రతి శనివారం భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో కొద్ది నెలలుగా దేవస్థానం ఆవరణలో అభివృద్ధి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నసమారాధన ఏర్పాటు చేసేవారు. అయితే పలు కారణాలతో కొద్ది రోజుల కిందట దానిని నిలిపేశారు. దీంతో భక్తుల ఇక్కట్లను దృష్టిలో పెట్టుకున్న తోటపల్లి గ్రామంలోని శ్రీకృషి విజయ వినాయక ఆలయం పరిధిలో కమిటీ సభ్యులు ప్రతి శనివారం విరాళాలతో అన్నసమారాధన నిర్వహిస్తున్నారు. మొత్తంగా వారు భక్తజనం ఆకలి తీరుస్తుడడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కమిటీ అధ్యక్షురాలు తామడ సరళాదేవి మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఆకలితో ఉండకుండా అన్నసమారాధన ఏర్పాటు చేస్తున్నామన్నారు. అయితే దర్శనం ఒక చోట, అన్నసమారాధన మరో చోట ఉన్న నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.