Share News

తప్పుడు సమాచారంతో అపాయం

ABN , Publish Date - May 29 , 2026 | 12:24 AM

మండలంలోని దుగ్గివలస గ్రామంలో విద్యు త్‌ సరఫరా నిలిపివేసినట్టు సబ్‌ స్టేషన్‌లో సంబంధిత సిబ్బంది తప్పుడు సమా చారం ఇవ్వడంతో విధి నిర్వహణలో ఉన్న ఎనర్జీ అసిస్టెంట్‌ రాము విద్యుదా ఘాతానికి గురయ్యాడు.

తప్పుడు సమాచారంతో అపాయం

గరివిడి, మే 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని దుగ్గివలస గ్రామంలో విద్యు త్‌ సరఫరా నిలిపివేసినట్టు సబ్‌ స్టేషన్‌లో సంబంధిత సిబ్బంది తప్పుడు సమా చారం ఇవ్వడంతో విధి నిర్వహణలో ఉన్న ఎనర్జీ అసిస్టెంట్‌ రాము విద్యుదా ఘాతానికి గురయ్యాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దుగ్గివలస గ్రామంలో 11/కేవీ విద్యుత్‌ తీగలకు ఒక కర్ర చిక్కుకుని ప్రమాదకరంగా మా రింది. దీనిని తొలగించేందుకు మందిరవలస సచివాలయం ఎనర్జీ అసిస్టెంట్‌ రాము, లైన్‌మన్‌ శంకర్‌తో కలిసి అక్కడికి చేరుకున్నారు. ప్రమాదాన్ని పసిగ ట్టిన లైన్‌మన్‌ శంకర్‌ ముందు జాగ్రత్తగా సబ్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేసి.. దుగ్గివ లస, ఐతంవలస, చిన ఐతంవలస, గదబవలస గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలని కోరారు. సబ్‌ స్టేషన్‌లోని సంబంధిత సిబ్బంది విద్యుత్‌ సర ఫరాను నిలిపివేసినట్టుగా లైన్‌మన్‌కు తెలిపారు. ఉన్నతాధికారుల భరోసాతో రాము రేకులషెడ్డుపైకి ఎక్కి విద్యుత్‌ తీగలకు తగిలి ఉన్న కర్రను తొలగించే ప్రయత్నం చేశాడు. అయితే ఆ కర్రకు వర్షపు నీరు తడి ఉండడంతో విద్యుత్‌ సరఫరా ఇంకా కొనసాగుతుండడంతో ఒక్కసారిగా భారీ విద్యుదాఘాతం సం భవించింది. ఈ ప్రమాదంలో రాము ఎడమ చేయి కొంతభాగం తీవ్రంగా కాలి పోగా, ఎడమ కాలుకు కూడా బలమైన గాయాలయ్యాయి. గాయపడిన రాము ను వెంటనే చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరు గైన వైద్యం కోసం విజయనగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాముకు ఎటువంటి ప్రాణాపాయం లేదు.

Updated Date - May 29 , 2026 | 12:25 AM