నవమి వేడుకల్లో నృత్యార్చన
ABN , Publish Date - Mar 23 , 2026 | 12:12 AM
సాలూరులో శ్రీరామలీలా నవమి వసంత ప్రయుక్త బ్రహ్మాత్సోవాల సందర్భంగా డబ్బివీధి రామ మందిరం, పెదకోమటిపేట రామాలయం వద్ద ఆదివారం రాత్రి చిన్నారుల నృత్యార్చన భక్తులను అలరించింది.
సాలూరు రూరల్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): సాలూరులో శ్రీరామలీలా నవమి వసంత ప్రయుక్త బ్రహ్మాత్సోవాల సందర్భంగా డబ్బివీధి రామ మందిరం, పెదకోమటిపేట రామాలయం వద్ద ఆదివారం రాత్రి చిన్నారుల నృత్యార్చన భక్తులను అలరించింది. డబ్బివీధి వద్ద పూర్ణిమా శిష్యబృందం శ్రీరాముడికి భక్తిగీతాలతో శాస్త్రీయ నృత్యార్చన నిర్వహించారు. ఈ సంద ర్భంగా చిన్నారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు భక్తులను ఆకట్టు కున్నా యి. పెదకోమటిపేట రామాలయం వద్ద శ్రీవాసవి నృత్య శిక్షణాలయం చిన్నారుల నృత్యార్చన అలరించింది. వెలమపేట నవోదయ శ్రీరామలీలా వేడుకల్లో రేలారే రేల జానపద నృత్య కార్యక్రమం ఆహుతులను ఆకట్టు కుంది. కాగా, నవమి వేడుకల్లో శ్రీరాముడికి హోమపూజలు, ప్రత్యేక అర్చ నలు రుత్వికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.