Dance Competitions సంక్రాంతి వేళ.. నృత్య పోటీలు
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:26 AM
Dance Competitions During Sankranti సంక్రాంతి పండుగ నేపథ్యంలో మండల, జిల్లా స్థాయిలో నృత్య పోటీలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ పోటీలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
పార్వతీపురం, డిసెంబరు3(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ నేపథ్యంలో మండల, జిల్లా స్థాయిలో నృత్య పోటీలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ పోటీలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. దేశభక్తి గీతాలు, జానపద, శాస్ర్తీయ నృత్య ప్రదర్శనలనే పరిగణనలోకి తీసుకుంటా మని వివరించారు. మొదటి విభాగంలో 15 సంవత్సరాలోపు బాల బాలికలకు, రెండో విభాగంలో 16 సంవత్సరాలు పైబడిన వారికి పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ పోటీల్లో పాల్గొనే వారు తమ పేర్లును ముందస్తుగా ఎంపీడీవో కార్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు. మం డల స్థాయి పోటీలను ఈ నెల 7లోపు పూర్తి చేసి విజేతల వివరాలను పంపించాలని ఎంపీ డీవోలను ఆదేశించారు. ఆ విజేతలతో డీఈవో పర్యవేక్షణలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా స్థాయి విజేతలకు సంక్రాంతి సంబరాల వేదికపై బహుమతులు అందజేస్తామని స్పష్టం చేశారు.