జామిలో దమ్మిడి తీర్థం
ABN , Publish Date - Feb 26 , 2026 | 12:07 AM
జామిలో దమ్మిడి తీర్థం అంగరంగ వైభవంగా బుధవారం జరిగింది. గ్రామంలో మహిళలు వివిద ప్రాంతాల నుంచి జాతరకోసం వచ్చే చుట్టాలు వెళ్లిపోయిన వరకు వారి సేవలో ఇళ్లలోనే ఉండిపోతారు.
జామి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): జామిలో దమ్మిడి తీర్థం అంగరంగ వైభవంగా బుధవారం జరిగింది. గ్రామంలో మహిళలు వివిద ప్రాంతాల నుంచి జాతరకోసం వచ్చే చుట్టాలు వెళ్లిపోయిన వరకు వారి సేవలో ఇళ్లలోనే ఉండిపోతారు. దీంతో వారి కోసం జాతర అనంతరం రెండురోజుల తర్వాత దమ్మిడి తీర్థం నిర్వహిస్తారు.ఈ సందర్భంగా బుధవారం అమ్మవారిని మహిళలు దర్శించుకొని మొక్కులు చెల్లించు కున్నారు. అనంతరం మహిళలు సామగ్రి కొనుగోలుచేశారు.అమ్మవారి పండుగ తర్వాత రోజు మహిళలకోసం గ్రామంలో ఏ వస్తువైనా దమ్మిడికి అమ్మేవారని, అందుకే ఈ పండుగకు దమ్మిడి తీర్థమని పేరువచ్చిందని గ్రామపెద్దలు తెలిపారు.