Share News

వైసీపీ హయాంలో దళితులకు రక్షణ కరువు

ABN , Publish Date - May 20 , 2026 | 12:10 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో దళితులకు రక్షణే లేకుండా పోయిందని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ అన్నారు.

వైసీపీ హయాంలో దళితులకు రక్షణ కరువు

విజయనగరం రూరల్‌, మే 19(ఆం ధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో దళితులకు రక్షణే లేకుండా పోయిందని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ అన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. తన వద్ద పనిచేసే డ్రైవర్‌ని హత్య చేయించి ఇంటికి డోర్‌ డెలివరీ చేయించిన ఎమ్మెల్సీపై అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కనీసం చర్యలు చేపట్టలేదన్నారు. కరోనా సమయంలో కనీస సౌకర్యాలు లేవని డా.సుధా కర్‌బాబు అన్నందుకు ఆయనను వేధింపులకు గురిచేశారన్నారు. ప్రస్తుత కూట మి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ప్రసాదుల ప్రసాద్‌, మామిడి రవిశంకర్‌, మైలిపిల్లి పైడిరాజుతో పాటు, టీడీపీ ఎస్సీ సెల్‌ విభాగం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2026 | 12:10 AM