దళిత ద్రోహి జగన్
ABN , Publish Date - May 20 , 2026 | 12:08 AM
వైసీపీ అధినేత జగన్‌రెడ్డి దళిత ద్రోహి అని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు.
శృంగవరపుకోట, మే 19(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్‌రెడ్డి దళిత ద్రోహి అని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. వైసీపీ హయాంలో హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం సంస్మరణ సభను మం గళవారం స్థానిక ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ముం దుగా బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడు తూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా జరిగా యన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చొక్కాకుల మల్లునాయుడు, టీడీపీ మం డల అధ్యక్షుడు డోకుల చినఅచ్చంనాయుడు, పార్టీ ఎల్.కోట మండల అధ్యక్షుడు కరెండ్ల ఈశ్వరరావు, దాసరి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్‌లు నానిగిరి రమణాజీ, బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు.