దళిత హక్కులు శతశాతం అమలు చేయాలి
ABN , Publish Date - May 13 , 2026 | 12:32 AM
దళిత వర్గా ల హక్కులను శతశాతం అమలు చేసి, వారి ఆర్థికాభివృ ద్ధికి సహకారం అందించాలని అధికార వర్గాలకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం సూచించారు.
రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు సీతారాం
విజయనగరం టౌన్, మే 12(ఆంధ్రజ్యోతి): దళిత వర్గా ల హక్కులను శతశాతం అమలు చేసి, వారి ఆర్థికాభివృ ద్ధికి సహకారం అందించాలని అధికార వర్గాలకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం సూచించారు. మంగ ళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యాల యంలో విధులు నిర్వహిస్తున్న దళిత ఉద్యోగుల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల హక్కులను పూర్తిగా అమలు చేయా ల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించాలన్నారు. ఉత్తరాంధ్రా దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు త్వరలో విస్త్రుత పర్యటనలు చేపడ తామని చెప్పారు. వివిధ శాఖల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ఎస్సీ సొసైటీకి 22శాతం రిజర్వేషన్ ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని అధికారులను ఆదేశించా రు. దళిత ఉద్యోగుల నుంచి వచ్చిన వినతులను 15 రోజుల్లోగా పరిష్కరించి, తనకు నివేదికను పంపాలన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ బాలరాజు, సహాయ కమిష నర్ అప్పలరాజు, డీఎంహెచ్‌వో జీవన్‌రాణి, డీసీహెచ్ పద్మశ్రీ పాల్గొన్నారు.