Share News

Cyclone Relief తుఫాన్‌ సహాయక చర్యలు వేగవంతం

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:14 AM

Cyclone Relief Operations Accelerated ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల భ ద్రతకు ప్రాధాన్యమిస్తూ.. సహాయక చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.

Cyclone Relief  తుఫాన్‌ సహాయక చర్యలు వేగవంతం

పార్వతీపురం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల భ ద్రతకు ప్రాధాన్యమిస్తూ.. సహాయక చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. విద్యుత్‌, తాగునీరు సరఫరా , రహదారులపై చెట్లు తొలగింపు, పంట నష్టాల అంచనా, రేషన పంపిణీని త్వరితగతిన చేపట్టాలన్నారు. హెల్ప్‌లైన్‌ నెంబర్లపై ప్రజలకు సమాచారం అందించాలని సూచించారు. రైతులకు పంట బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఆర్థిక సహాయంపై అవగాహన కల్పించాలని, సీఎం కిసాన్‌ అన్నదాత సుఖీభవ పథకం కింద ఖాతాల్లో నగదు జమైన విషయాన్ని తెలియజేయాలని చెప్పారు. పట్టణాల్లో 24 గంటల్లో, గ్రామాల్లో 72 గంటల్లో సాధ్యమైనంత వరకు అత్యవసర సేవలను పునరుద్ధరించాలన్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు.

ఎన్నికల నిబంధనలు పాటించాలి

ఎన్నికల విధులకు హాజరవుతున్న సిబ్బంది విధిగా నిబంధనలు పాటించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. మున్సిపల్‌ పోలింగ్‌కు కేటాయించిన సిబ్బంది శనివారం తప్పనిసరిగా శిక్షణకు హాజరువ్వాలన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్‌కు కేటాయించిన సిబ్బందికి మాత్రం నవంబరు 3న ప్రత్యేక శిక్షణ ఉం టుందని తెలిపారు. ఎన్నికల విధులకు సంబంధించిన ఉత్తర్వులు, మార్గదర్శ కాలను సిబ్బంది పూర్తిగా చదవాలని సూచించారు. నిరంతరం అప్రమ త్తంగా ఉండాలని ఆదేశించారు.

Updated Date - Oct 31 , 2026 | 12:14 AM