Share News

కారు ఢీకొని సైకిలిస్టు మృతి

ABN , Publish Date - Jun 27 , 2026 | 11:59 PM

కారు ఢీకొన్న ఘటనలో సైకిలిస్టు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది.

కారు ఢీకొని సైకిలిస్టు మృతి

బొండపల్లి, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): కారు ఢీకొన్న ఘటనలో సైకిలిస్టు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. దీనిపై ఎస్‌ఐ యు.మహేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గజపతినగరం మండలంలోని బూడిపేట గ్రామానికి చెందిన తిమినాన సత్యం(58) సైకిల్‌పై పాలను తీసుకుని వెళ్తుండగా బోడసింగి పేట గ్రామంలోని హీరో షోరంనకు ఎదురుగా జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్‌ కారు నిలపకుండా పరారయ్యాడు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం గజపతినగరంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Updated Date - Jun 27 , 2026 | 11:59 PM