Custard Apple సీతాఫలాలు అ‘ధర’హో!
ABN , Publish Date - Aug 02 , 2026 | 11:42 PM
Custard Apple Prices Soar సీతంపేట వారపుసంతకు సీతాఫలాలు వచ్చేశాయి. సీజన్ ప్రారంభం కావడంతో ఆదివారం పెద్దఎత్తున గిరిజనులు వాటిని తీసుకొచ్చారు. ఒక్కో కేటు ధర రూ.1200 నుంచి రూ.1500వరకు పలికింది. దీంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
ఆనందంలో గిరిజన రైతులు
సీతంపేట, ఆగస్టు2(ఆంధ్రజ్యోతి): సీతంపేట వారపుసంతకు సీతాఫలాలు వచ్చేశాయి. సీజన్ ప్రారంభం కావడంతో ఆదివారం పెద్దఎత్తున గిరిజనులు వాటిని తీసుకొచ్చారు. ఒక్కో కేటు ధర రూ.1200 నుంచి రూ.1500వరకు పలికింది. దీంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేశారు. సీజన్ ముగిసే వరకు ధర ఇలాగే ఉంటే.. తమకు మంచి లాభాలు వస్తాయని వారు తెలిపారు. వాస్తవంగా ఎటువంటి రసాయనాలు వినియోగించకుండా పండే ఈ సీతాఫలాలకు ఈ ప్రాంతంలో మంచి డిమాండ్ ఉంది. పెద్దసైజు పండ్లు అయితే ఒక్కో ప్లాస్టిక్ కేటు ధర రూ.2వేల వరకు పలుకుతుంది. ఇప్పటికే సుదూర ప్రాంతాల నుంచి వ్యాపారులు సీతంపేట వారపుసంతకు తరలివచ్చి గిరిజనుల నుంచి వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి నేరుగా మైదాన ప్రాంతాలకు తరలించి.. డిమాండ్ మేరకు అధిక ధరలకు విక్రయాలు చేపడుతున్నారు. ఏదే మైనా సీజన్ ప్రారంభంలోనే సీతాఫలం పంటకు మంచి డిమాండ్,ధర ఉండడంతో గిరిజన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.