డ్రోన్ పోలీసింగ్‌తో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట
ABN , Publish Date - Jun 12 , 2026 | 12:21 AM
డ్రోన్ పోలీసింగ్‌తో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి పోలీసులను ఆదేశించారు.
- ఎస్పీ మాధవరెడ్డి
బెలగాం, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): డ్రోన్ పోలీసింగ్‌తో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి పోలీసులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ సమావేశ మందిరంలో నెలవారీ నేర సమీక్షను వర్చువల్‌గా నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, మర్డర్, ప్రాపర్టీ, చీటింగ్, గంజాయి, రోడ్డు ప్రమాదాలు తదితర కేసులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సాంకేతికతను ఉపయోగించి పెండింగ్ కేసులను త్వరితగతిన దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ప్రజలకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, రోడ్డు భద్రతా నియమాలపై విస్త్రత ప్రచారం నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ-చలానా, డ్రంకెన్ డ్రైవ్‌పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, సారా నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో వాట్సప్ గవర్నస్ సేవలు ప్రజలకు కనబడేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా సంబంధిత నేరాలకు సంబంధించి కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసులపై ఆరా తీసి వాటి పరిష్కారానికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థను అమలు చేయడం ప్రారంభంలో కొంత కష్టతరంగా ఉన్నప్పటికి, భవిష్యత్‌లో నేరాల దర్యాప్తుకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వరరావు, పార్వతీపురం ఏఎస్పీ మనీషా వంగలరెడ్డి, డీఎస్పీలు రాంబాబు, థామస్‌రెడ్డి, డీసీఆర్‌బీ సీఐ ఆదాం, ఎస్బీ సీఐ రమణమూర్తి, సైబర్ సెల్ సీఐ తదితరులు పాల్గొన్నారు.