Share News

3వేల ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:06 AM

జిల్లాలో ఈ ఏడాది 3వేల ఎరరాల్లో పండ్ల తోటల పెంపకం లక్ష్యంగా పెట్టుకున్నామని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ శారదాదేవి తెలిపారు.

3వేల ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం
జుమ్మువలసలో డ్వామా పీడీ శారదాదేవి

రామభద్రపురం, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ ఏడాది 3వేల ఎరరాల్లో పండ్ల తోటల పెంపకం లక్ష్యంగా పెట్టుకున్నామని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ శారదాదేవి తెలిపారు. మండలంలోని జుమ్మువలస గ్రామంలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఈ ఒక్కరోజే 350 ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. 6 నియోజకవర్గాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి పండ్ల మొక్కలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఎకరాకు 3 సంవత్సరాల్లో రైతుకు రూ.1.5 లక్షలు ప్రభుత్వం అందిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు మొక్కలు నాటుకున్న తర్వాత అంతర పంటలు సాగు చేసుకోవచ్చని సూచించారు. మామిడి, జీడి, కొబ్బరి, నేరేడు, ఉసిరితో పాటు వెదురు మొక్కలు పెంచడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చని తెలిపారు. జమ్ము వలస గ్రామంలో 18 ఎకరాల్లో 12మంది రైతులు మొక్క లు నాటుతున్నారన్నారు. ఇందుకు హార్టికల్చర్‌ అధికారుల సూచనలు, సలహాలు తీసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి ఎం.ర త్నం, ఏపీవో గొలగాని త్రినాథరావు, ఉపాధిహామీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 12:06 AM