Share News

Crying Uncontrollably గుక్కపెట్టి ఏడ్చి.. గంటల వ్యవధిలోనే కన్నుమూసి!

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:36 PM

Crying Uncontrollably… and Passing Away Within Hours! రెండో సంతానంగా కొడుకు పుట్టడంతో ఆ గిరిజన దంప తులు ఎంతో సంతో షించారు. చిన్నారి బోసినవ్వులు చూసి మురిసి పోయారు. బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటున్న వారిపై విధి చిన్నచూపు చూసింది. అప్పటి వరకు చక్కగా ఉయ్యాలలో పడుకున్న రెండు నెలల చిన్నారి ఉన్నట్టుండి గుక్కపెట్టి ఏడ్చాడు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే మృతి చెందాడు. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Crying Uncontrollably   గుక్కపెట్టి ఏడ్చి.. గంటల వ్యవధిలోనే కన్నుమూసి!
మృతి చెందిన బాలుడు

  • కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు

సీతంపేట, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి) : రెండో సంతానంగా కొడుకు పుట్టడంతో ఆ గిరిజన దంప తులు ఎంతో సంతో షించారు. చిన్నారి బోసినవ్వులు చూసి మురిసి పోయారు. బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటున్న వారిపై విధి చిన్నచూపు చూసింది. అప్పటి వరకు చక్కగా ఉయ్యాలలో పడుకున్న రెండు నెలల చిన్నారి ఉన్నట్టుండి గుక్కపెట్టి ఏడ్చాడు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే మృతి చెందాడు. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాదకర ఘటన సీతంపేట ఏజెన్సీలో చోటుచేసుకుంది.

దేవనాపురం పంచాయతీ వంబరెల్లి గ్రామానికి చెందిన సవర వెంకటేష్‌, భారతి దంపతులు కొండపోడు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల కిందట వారికి మొదటి సంతానంగా పాప పుట్టింది. ఆ తర్వాత రెండు నెలల కిందట బాబు జన్మించాడు. దీంతో వారి ఆనందానికి అవధు ల్లేకుండా పోయింది. అయితే బాలుడికి ఏమైందో ఏమో కాని శనివారం ఉదయం నుంచి గుక్క పెట్టి ఏడ్చాడు. తల్లి పాలు కూడా తాగకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. హుటాహుటిన బాలుడ్ని సీతంపేట ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుపత్రికి అదే రోజున రెఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. కుమారుడు అకాల మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భోరున విలపించారు. ఈ ఘటనతో వంబరెల్లి గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.

Updated Date - Oct 04 , 2026 | 11:36 PM