నదిని దాటి.. ఓటేసి
ABN , Publish Date - Nov 06 , 2026 | 01:07 AM
పారన్నవలస పంచాయతీలోని రెండు గ్రామాలకు చెందిన ఓటర్లు సాహసం చేశారు.
- నడుము లోతు నీటిలో దిగి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లు
-రొంగళివానివలస, చినపారన్నవలస గ్రామస్థుల సాహసం
సాలూరు, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): పారన్నవలస పంచాయతీలోని రెండు గ్రామాలకు చెందిన ఓటర్లు సాహసం చేశారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వేగావతి నదిలోకి దిగి, నడుము లోతు నీటిలో నడుచుకుంటూ ఒడ్డుకు చేరారు. అక్కడి నుంచి పోలింగ్ కేం ద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. పారన్నవలస పంచాయతీ పరి ధిలో చినపారన్నవలస, పెదపారన్నవలస, భవానిపురం, రొంగళివానివలస గ్రామాలకు చెందిన 718 మంది ఓటర్లు ఉన్నారు. ఎంపీ టీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 29వ పోలింగ్ కేంద్రాన్ని పెదపారన్నవలసలో అధి కారులు ఏర్పాటు చేశారు. రొంగళివానివలస, చినపారన్నవలసకు చెందిన ఓటర్లు పెదపార న్నవలస రావాలి అంటే మధ్యలో ఉన్న వేగా వతి నదిని దాటాల్సి ఉంది. దీంతో వీరంతా నడుము లోతుగా ప్రవహిస్తున్న వేగావతి నదిని దాటి వెళ్లి పెదపారన్నవలసలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇటీవల ఆర్నాబ్ తుఫాన్‌తో కురిసిన భారీ వర్షాల కార ణంగా వేగావతి నది ఉధృతంగా ప్రవహిం చింది. ఆ ప్రవాహం ఇంకా తగ్గకపోవడంతో ఇలా నదిని దాటాల్సి వచ్చిందని ఆయా గ్రామస్థులు చెబుతున్నారు. అలాగే చిన్నపాటి వర్షమైనా చినపారన్నవలస, రొంగళివానివలస గ్రామాల నుంచి పారన్నవలసకు సంబంధాలు పూర్తిగా తెగిపోతాయని అంటున్నారు. అలాగే పారన్నవలస సిగ్మెంట్ పరిధిలోని భవానిపు రం గ్రామంలో దాదాపు 150 ఓటర్లు ఉన్నారు. వీరు కూడా పెదపారన్నవలస, భవానిపురం మధ్య ఉన్న కూర గెడ్డను దాటి వచ్చి పెదపా రన్నవలస కేంద్రంలో ఓటు వేశారు. వీరంతా రెండు జతల బట్టలను వినియోగించారు. నది ని దాటిన తరువాత
ఒంటిపై ఉన్న తడిసిన దుస్తులను తొలగించి మరో జత బట్టలను ధరించి పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటేశారు. వృద్ధులు, దివ్యాంగులను పోలింగ్ కేంద్రానికి తీసుకువెళ్లేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చిందని గ్రామస్థులు చెబుతున్నారు.
ఇబ్బందులు పడ్డాం
నిత్యం వర్షాలు కురిస్తే నది ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో పెదపారన్నవలసకు వెళ్లాలంటే ఇబ్బందులు తప్పవు. ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది. అయితే ఓటు వేయడానికి ఇలా సమస్య రావడం ఇదే మొదటిసారి. దీనివల్ల ఇబ్బం దులు పడ్డాం.
-వెంకటరావు, చినపారన్నవలస
మా అమ్మను తీసుకురాలేకపోయాం:
మా అమ్మకు 68 సంవత్సరాలు. వృద్ధురా లు. కొద్దిపాటి అనారోగ్యంతో మంచానపడి ఉంది.ఓటు వేయడానికి వస్తానని చెప్పింది. కానీ, నదిలో నీటి ప్రవాహం వల్ల పోలింగ్ కేంద్రానికి తీసుకొని రాలేకపోయాం.
-లక్ష్మి, రొంగళివానివలస