క్రికెట్ విజేత ‘కొండవీధి గుమ్మలక్ష్మీపురం’
ABN , Publish Date - Jun 12 , 2026 | 12:30 AM
కె.శివడలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నీలో కొండవీధి గుమ్మలక్ష్మీపురం జట్టు విజేతగా నిలిచింది.
గుమ్మలక్ష్మీపురం, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): కె.శివడలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నీలో కొండవీధి గుమ్మలక్ష్మీపురం జట్టు విజేతగా నిలిచింది. టోర్నీలో సుమారు 60 జట్లు పాల్గొన్నాయి. ఆదివారం కె.శివడ జట్టు, కొండవీధి గుమ్మలక్ష్మీపురం జట్టు మధ్య ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన కొండవీధి గుమ్మలక్ష్మీపురం జట్ట నిర్ణీత ఓవర్లలో 128 పరుగులు సాధించింది. అనంతరం 129 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కె.శివడ జట్టు 90 పరుగులే సాధించింది. దీంతో కొండవీధి గుమ్మలక్ష్మీపురం జట్టు విజేతగా ప్రకటించి రూ. 25 వేలు, రన్నరప్‌గా నిలిచిన కె.శివడ జట్టుకు రూ.12,500 నగదు బహుమతిని నిర్వాహకులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొత్తాడ గౌరీశంకరరావు, టీఆర్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రొబ్బా లోవరాజు, మాజీ సర్పంచ్ బి.శంకరరావు, భాస్కరరావు, సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.