Share News

Cricket Fever క్రికెట్‌ జోష్‌

ABN , Publish Date - Mar 09 , 2026 | 12:22 AM

Cricket Fever టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో టీమ్‌ ఇండియా గెలవడంతో జిల్లావాసుల ఆనందానికి అవధు ల్లేకుండా పోయింది. న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో భారత్‌ గెలవడంతో వాడవాడలా సంబరాలు చేసుకున్నారు.

Cricket Fever క్రికెట్‌  జోష్‌
పార్వతీపురం టౌన్‌లో పట్టణవాసుల కేరింత

  • సంబరాలు చేసుకున్న క్రీడాభిమానులు

పార్వతీపురం టౌన్‌/ పాలకొండ/గరుగుబిల్లి, మార్చి8(ఆంధ్రజ్యోతి): టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో టీమ్‌ ఇండియా గెలవడంతో జిల్లావాసుల ఆనందానికి అవధు ల్లేకుండా పోయింది. న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో భారత్‌ గెలవడంతో వాడవాడలా సంబరాలు చేసుకున్నారు. మూడోసారి ట్రోఫీని దక్కించుకుని టీమ్‌ ఇండియా చరిత్ర సృష్టించిన నేపథ్యంలో బాణ సంచా కాల్చి.. స్వీట్లు పంచారు. మరికొన్నిచోట్ల యువత జాతీయ పతాకంతో సందడి చేశారు. కాగా ఇండియా-న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించేందుకు అంతా ఆసక్తి కనబరిచారు. పల్లె, పట్టణం తేడా లేకుండా ఆది వారం అన్ని వర్గాల వారు మొబైల్‌ఫోన్లు, టీవీలకు అతుక్కుపోయారు. ఈ నేపథ్యంలో నిత్యం రద్దీగా కనిపించే ప్రధాన రహదారులన్నీ సాయంత్రం ఆరున్నరకే నిర్మాను ష్యంగా మారాయి. కొన్ని చోట్ల రహదారులపై , గ్రామాల్లోని రామమందిరాలు, ప్రధాన వీధుల్లో యువత భారీ స్ర్కీన్‌లను ఏర్పాటు చేసుకొని ఉత్కంఠగా మ్యాచ్‌ను తిలకించారు.

Updated Date - Mar 09 , 2026 | 12:22 AM