Share News

నీటిపై రంగవల్లులు తీర్చిదిద్దుతూ..

ABN , Publish Date - Oct 19 , 2026 | 12:16 AM

ఓ వైపు మండల రీసర్వే డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తునే నీటిపై రంగులతో అందమైన రంగవళ్లులు తీర్చిదిద్దుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు నాగలక్ష్మి

నీటిపై రంగవల్లులు తీర్చిదిద్దుతూ..

గంట్యాడ, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ఓ వైపు మండల రీసర్వే డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తునే నీటిపై రంగులతో అందమైన రంగవళ్లులు తీర్చిదిద్దుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు నాగలక్ష్మి. 2013లో జూని యర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించిన నాగలక్ష్మి.. అప్పటి నుం చి కలెక్టరేట్‌, ఎస్‌.కోట, చీపురుపల్లి ప్రాంతాల్లో విధులు నిర్వహిం చారు. ఇప్పుడు గంట్యాడ మండలంలో రీసర్వే డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సాధారణంగా నేలపై రంగులతో ముగ్గులు వేయడం అందరికీ తెలిసిందే. కానీ నీటిపై రంగులతో ముగ్గులు వేయడం ఆమె ప్రత్యేకత. నీటిపై రంగులను నిలబెట్టి అవి చెదిరిపోకుండా జాగ్రత్తగా ఒక్కో ఆకారాన్ని తీర్చిదిద్దూతూ అద్భుతమైన చిత్రాలను రూపొందిసున్నారు.

Updated Date - Oct 19 , 2026 | 12:16 AM