చెత్త నుంచి సంపద సృష్టించాలి
ABN , Publish Date - May 17 , 2026 | 12:23 AM
గ్రామాలను పరి శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని జిల్లా పంచాయతీ అధికారి డి.మల్లికార్జునరావు సూచిం చారు.
బొండపల్లి, మే 16(ఆంధ్రజ్యోతి): గ్రామాలను పరి శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని జిల్లా పంచాయతీ అధికారి డి.మల్లికార్జునరావు సూచిం చారు. మండలంలోని గొట్లాం గ్రామంలో గల చెత్త సం పద కేంద్రాన్ని ఆయన శనివారం పరిశీలించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సేకరించిన చెత్త నుంచి వర్మీకంపోస్టు తయారుచేసి వాటిని విక్రయించడం ద్వారా పంచాయతీలు ఆదా యం పెంచుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామం లో కూడా తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించి.. వాటి నుంచి సంపద సృష్టించడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అరసాడ రఘుపతిరావు, డిప్యూటీ తహసీల్దార్ వై.రా జేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ కోరాడ కృష్ణ, పంచా యతీ కార్యదర్శి జి.సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.