Share News

రైతుల్లో మరింత చైతన్యం కలిగించండి

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:13 AM

రైతులు అధిక దిగుబడులు సాధిం చేందుకు వారిలో మరింత చైతన్యం కలిగిం చాలని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డి వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

రైతుల్లో మరింత చైతన్యం కలిగించండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి

సాలూరు రూరల్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్ర జ్యోతి): రైతులు అధిక దిగుబడులు సాధిం చేందుకు వారిలో మరింత చైతన్యం కలిగిం చాలని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డి వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. బుధవారం సాయంత్రం జనవరివలస వద్ద వ్యవసాయాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి రైతు వ్యవసాయం పండుగ లా భావించాలన్నారు. ఆహార ఉత్పత్తులను అధికంగా సాధించేలా వారిని ప్రోత్సహించాల న్నారు. సమాజానికి ఆహార భద్రత చేకూరేలా వ్యవసాయాధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు శ్రద్ధ తీసుకోవాల న్నారు. రైతులు వాణిజ్య పంటలు సైతం విరివిగా సాగు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఆకళింపు చేసుకునేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. యూరియా, నానో యూరి యాల వినియోగం ప్రయో జనాలను రైతులకు పూర్తిస్థాయిలో వివరిం చాలన్నారు. వ్యవసాయంలో జిల్లా ప్రథమస్థానం సాధించేలా అధికారులు కృత నిశ్చయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ బి.నీలకంఠరావు, ఎంపీడీవో గొల్లపల్లి పార్వతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 12:13 AM