సారా రవాణాకు అడ్డుకట్ట
ABN , Publish Date - Jul 07 , 2026 | 12:03 AM
జిల్లాలో నాటు సారా తయారీ, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె. సహదేవ్ తెలిపారు. తిరుపతిలో ఏఈఎస్‌గా పనిచేసిన ఆయన ఈఎస్‌గా పదోన్నతిపై జిల్లాకు వచ్చారు. ఈ మేరకు సోమవారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
పార్వతీపురంటౌన్, జూలై 6(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో నాటు సారా తయారీ, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె. సహదేవ్ తెలిపారు. తిరుపతిలో ఏఈఎస్‌గా పనిచేసిన ఆయన ఈఎస్‌గా పదోన్నతిపై జిల్లాకు వచ్చారు. ఈ మేరకు సోమవారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ.. ఏవోబీ సరిహద్దు గ్రామాల్లో సారా తయారీ, రవాణాకు సంబంధించి స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. జిల్లాలో మద్యం షాపుల నుంచి బెల్టు షాపులకు మద్యం బాటిళ్లు అక్రమంగా వెళ్లకుండా చూస్తామని తెలిపారు. ఎక్సైజ్ పాలసీ విధానానికి అనుగుణంగా ఆదాయం పెంపునకు తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారులు, సిబ్బంది సహకారంతో ప్రభుత్వ లక్ష్యాలను అనుగుణంగా పనిచేస్తామన్నారు.