తోటపల్లిలో హుండీల లెక్కింపు
ABN , Publish Date - Oct 23 , 2026 | 12:08 AM
తోటపల్లిలోని వేంకటేశ్వర, కోదండ రామ స్వామి దేవస్థానాల పరిధిలో గురువారం హుండీలను లెక్కించారు.
గరుగుబిల్లి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): తోటపల్లిలోని వేంకటేశ్వర, కోదండ రామ స్వామి దేవస్థానాల పరిధిలో గురువారం హుండీలను లెక్కించారు. దేవస్థానం ఈవో వీవీ సూర్యనారాయణ పర్యవేక్షణలో స్వామివార్లకు భక్తులు కానుకల రూపంలో అందించిన మొత్తాలను పాలకొండ శ్రీజగ న్నాథస్వామి దేవాలయం ఈవో కె.పర మేశ్వరి సమక్షంలో లెక్కింపు నిర్వహిం చారు. వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించి రూ.8,12,489లు, 25 గ్రా ముల 600 మిల్లీగ్రాముల బంగారం, మూడు కేజీల 100 గ్రాముల వెండి, కోదం డరామస్వామి దేవస్థానానికి సంబంధించి రూ 3,669లు వచ్చాయని ఈవో తెలిపారు. మొత్తం105 రోజులకు గాను రూ. 8,16, 158లు వచ్చాయని చెప్పారు. కార్యక్రమం లో ప్రధాన అర్చకులు వీవీ అప్పలాచా ర్యులు, సిబ్బంది జి.శ్రీధర్నాయుడు, శ్రీవారి సేవకులు, దాతలు పాల్గొన్నారు.