టీడీపీలో చేరిన కౌన్సిలర్ రవితేజ
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:05 AM
పార్వతీపురం మున్సిపాలిటీకి చెందిన 32 వార్డు స్వతంత్ర కౌన్సిలర్ చింతాడ రవితేజ శుక్రవారం టీడీపీలో చేరారు.
పార్వతీపురం రూరల్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మున్సిపాలిటీకి చెందిన 32 వార్డు స్వతంత్ర కౌన్సిలర్ చింతాడ రవితేజ శుక్రవారం టీడీపీలో చేరారు. వెంకంపేటలోని టీడీపీ కార్యాలయంలో రవితేజతో పాటు పలువురికి ఎమ్మెల్యే విజయచంద్ర కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బెలగాం జయప్రకాశ్‌నారాయణ, కౌన్సిలర్లు బడే గౌరునాయుడు, కోలా మధు, టీడీపీ పట్టణ కార్యదర్శి ఎం.వెంకటేశ్ పాల్గొన్నారు.