పాసు పుస్తకాల్లో తప్పులుంటే సరిచేసుకోండి
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:03 AM
ప్రభుత్వం రైతులకు అందించిన పట్టాదారు పాసు పుస్తకా ల్లో ఏమైనా తప్పులుంటే ఈనెల 9లోగా వీఆర్వో లకు తెలియజేయాలని జేసీ సేతు మాధవన్ సూచించారు.
జేసీ సేతు మాధవన్
జామి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం రైతులకు అందించిన పట్టాదారు పాసు పుస్తకా ల్లో ఏమైనా తప్పులుంటే ఈనెల 9లోగా వీఆర్వో లకు తెలియజేయాలని జేసీ సేతు మాధవన్ సూచించారు. గొడుకొమ్ము గ్రామంలో పంపిణీకి సిద్ధం చేసిన పాసు పుస్తకాలను ఆయన శనివా రం పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కృష్ణంరాజు, ఆర్‌ఎస్‌డీటీ అర్జున్‌తో వీటి పంపిణీ విషయంపై చర్చించారు. ఈనెల 9 లోపు వీఆర్వోలు ఇప్పటివరకు పంపిణీ చేసిన పుస్తకా లు ఉన్న రైతుల వద్దకు వెళ్లి, వారి పుస్తకాల్లో ఏమైనా తప్పులు ఉంటే సేకరిస్తారని, వీటిని ఈనెల 14లోపు ఆన్‌లైన్‌లో నమోదుచేసి సరిదిద్దుతారని ఆయన వివరించారు.