Share News

ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్‌ విద్య

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:20 AM

ప్రభుత్వ బడుల్లో కార్పొ రేట్‌ విద్యనందించేందుకు కూ టమి ప్రభుత్వం కృషి చేస్తోందని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు.

 ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్‌ విద్య
బెలగాం: ప్రచార రథాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే విజయచంద్ర:

బెలగాం, మార్చి 20 (ఆంధ్ర జ్యోతి) : ప్రభుత్వ బడుల్లో కార్పొ రేట్‌ విద్యనందించేందుకు కూ టమి ప్రభుత్వం కృషి చేస్తోందని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు. శుక్రవారం పార్వతీపురంలో యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పిద్దా- మన ఊరి బడిని కాపాడుకుందాం నిర్వహిం చిన కార్యక్రమానికి సంబంధిం చిన ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు, యూటీఎఫ్‌ నాయకులు ఎస్‌.మురళీమోహన్‌ పాల్గొన్నారు.

20 లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యం

పార్వతీపురం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షలు ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే 20 నెలల్లో 6,28,347 ఉద్యోగాలు యువతకు కల్పించినట్లు తెలిపారు. ఉగాది కానుకగా రాష్ట్రంలో యువతకు బంగారు భవిష్యత్‌ అందిం చేందుకు జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటించి భారీగా టీచర్‌ పోస్టులను భర్తీ చేసిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, దేవిచంద్రమౌళి, రౌతువేణు, మజ్జి వెంకటేష్‌, కోలా మధు, దివ్య పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2026 | 12:20 AM