విజయనగరంలో కార్డన్ సెర్చ్
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:07 AM
విజ యనగరం రూరల్ సర్కిల్ పరిధిలోని గుంకలాం లేఅవు ట్‌లో సోమవారం తెల్లవారు జామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
10 మోటార్ సైకిళ్లు సీజ్
8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
విజయనగరం క్రైం, ఫిబ్ర వరి 23 (ఆంధ్రజ్యోతి): విజ యనగరం రూరల్ సర్కిల్ పరిధిలోని గుంకలాం లేఅవు ట్‌లో సోమవారం తెల్లవారు జామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమా రు 60 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి లేఅవుట్ లోని అన్ని ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లోనూ తనిఖీలు చేశారు. అపరిచిత వ్యక్తుల వివరాలు సేకరించి వారి వేలి ముద్రలను ఎంఎస్ పరికరాలతో తనిఖీలు చేశా రు. రికార్డులు సక్రమంగా లేని 10 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. 8 మం ది అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ డీఎస్పీ ఆర్.గోవిందరావు మాట్లాడుతూ.. ప్రజల భద్రతా, నేరాల నియంత్రణ, సారా, నిషేధిత వస్తువుల రవాణాను అడ్డుకోవడం, అనుమానిత వ్యక్తులను గుర్తించడమే లక్ష్యంగా ఈ కార్డన్‌సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలో మరిన్ని ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణరావు, ఎస్‌ఐ అశోక్‌కుమార్, మాతామూర్తి, గంట్యాడ ఎస్‌ఐ సాయికృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.