ww
ABN , Publish Date - Jun 14 , 2026 | 12:16 AM
సాలూ రులోని బంగారమ్మకా లనీలో పట్టణ సీఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో శనివారం కార్డన్‌సెర్చ్ నిర్వహించారు.
సాలూరు, జూన్ 13(ఆంధ్రజ్యోతి): సాలూ రులోని బంగారమ్మకా లనీలో పట్టణ సీఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో శనివారం కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ మేరకు కాలనీలో తనిఖీలు నిర్వహించి 25 వాహనాలను పరిశీలించారు. గంజాయి, ఇతర అక్రమ కార్యకలాపాల నియంత్రణపై నిఘాలో భాగంగా తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. అనంతరం ర అవగాహన కల్పించి ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమాన్ని డ్రోన్ సర్వైలైన్స్, వీడియోగ్రఫీ ద్వారా చిత్రకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.