Share News

Cooperative society elections pass off peacefully. సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంతం

ABN , Publish Date - Jul 15 , 2026 | 12:06 AM

Cooperative society elections pass off peacefully. ఎట్టకేలకు విజయనగరం, పార్వతీపురం-మన్యం జిల్లాల్లో గొర్రెలు పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 9 గంటల నుంచి మఽధ్యాహ్నం 3గంటల వరకూ ఎన్నికల ప్రక్రియ జరిగింది. ఉమ్మడి జిల్లాలో పశు సంవర్థకశాఖ కార్యాలయాలు, ఆసుపత్రులు, సంఘ భవనాల్లో ఈ ఎన్నికలను నిర్వహించారు.

Cooperative society elections pass off peacefully. సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంతం
బొబ్బిలి మండలం పిరిడిలో ఎన్నికల చిత్రం

సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంతం

అన్ని చోట్లా హాజరైన గొర్రెల పెంపకందారులు

ఉమ్మడి విజయనగరం జిల్లాలో 105 సంఘాలకు ఎన్నికలు

103 ఏకగ్రీవం, 2 చోట్ల పోటీ

వచ్చేనెలలో జిల్లా సహకార సంఘ చైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌

విజయనగరం రూరల్‌, జూలై14(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు విజయనగరం, పార్వతీపురం-మన్యం జిల్లాల్లో గొర్రెలు పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 9 గంటల నుంచి మఽధ్యాహ్నం 3గంటల వరకూ ఎన్నికల ప్రక్రియ జరిగింది. ఉమ్మడి జిల్లాలో పశు సంవర్థకశాఖ కార్యాలయాలు, ఆసుపత్రులు, సంఘ భవనాల్లో ఈ ఎన్నికలను నిర్వహించారు. చేతులెత్తే పద్ధతిలో ఈ ఎన్నికలు జరిగాయి. పార్వతీపురం మన్యం ప్రాంతానికి సంబంధించి 32 ప్రాథమిక సహకార సంఘాలు వుండగా, వీటిలో 4 సంఘాలకు ఎన్నికలు జరగలేదు. 28 సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. 27 ఏకగ్రీవం అయ్యాయి. కొమరాడలో మాత్రం ఈ ఎన్నిక రసవత్తరంగా సాగింది. ఇక విజయనగరం జిల్లా విషయానికి వస్తే 82 సంఘాలు వుండగా, 5 సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదు. 77 సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. 76 సంఘాల ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. గరివిడి మండలం ఎం.దుగ్గువలస గ్రామంలో పోటీ అనివార్యమైంది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో పశు సంవర్థకశాఖ అధికారులు విజయం సాధించిన వారికి ధ్రువీకరణ పత్రం అందించారు. అదే విధంగా పశు సంవర్థకశాఖాధికారులు ఎన్నికలకు సంబంధించిన ఫైలును సిద్ధం చేసి బుధవారం విజయనగరం, పార్వతీపురం-మన్యం కలెక్టర్లకు అందించనున్నారు.

ఆగస్టు తొలి వారంలో జిల్లా చైర్మన్‌ ఎన్నిక

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో ఈ సంఘాలకు అధ్యక్షులుగా ఎన్నికైన వారు, జిల్లా స్థాయి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం కలెక్టరే నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈనెల చివరి వారం లేదా ఆగస్టు తొలివారంలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. చైర్మన్‌ అభ్యర్థిని వారం రోజుల్లో నిర్ణయించాలని కూటమి నాయకులు భావిస్తున్నట్లు తెలిసింది.

Updated Date - Jul 15 , 2026 | 12:06 AM