Share News

స్వచ్ఛమైన గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సహకరించాలి

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:06 AM

స్వచ్ఛమైన గ్రామాలుగా తీర్చిది ద్దేందుకు ప్రజలంతా సహకరించాలని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కోరారు. గిరిజనుల ఆశాజ్యోతి అల్లూరి సీతరామరాజు అని తెలిపారు. సీతంపేట బస్టాండ్‌ ఆవరణలో విప్లవవీరుడు అల్లూరి సీతరామరాజు 129వ జయంతి పురస్కరించుకొని అల్లూరి సీతరామరాజు విగ్రహానికి పూలమాలను వేసి నివాళుర్పించారు.

 స్వచ్ఛమైన గ్రామాలుగా   తీర్చిదిద్దేందుకు సహకరించాలి
భామిని: ట్రైసైకిల్‌ను అందజేస్తున్న పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ :

సీతంపేట రూరల్‌, జూలై 4(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛమైన గ్రామాలుగా తీర్చిది ద్దేందుకు ప్రజలంతా సహకరించాలని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కోరారు. గిరిజనుల ఆశాజ్యోతి అల్లూరి సీతరామరాజు అని తెలిపారు. సీతంపేట బస్టాండ్‌ ఆవరణలో విప్లవవీరుడు అల్లూరి సీతరామరాజు 129వ జయంతి పురస్కరించుకొని అల్లూరి సీతరామరాజు విగ్రహానికి పూలమాలను వేసి నివాళుర్పించారు. అనంతరం స్థానిక మండలపరిషత్‌ కార్యాలయ ఆవరణలో తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే ట్రైసైకిళ్లను ఎమ్మెల్యే పంపిణి చేశారు. కార్యక్రమంలో ఏపీవో జి.చిన్నబాబు,ఎంపీడీవో బిబి మిశ్రో, డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు, సెక్రటరీ రామకృష్ణ, కూటమి నాయ కులు పవన్‌,ప్రభుకుమార్‌ పాల్గొన్నారు.

ఫభామిని, జూలై 4(ఆంధ్రజ్యోతి): భామినిలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచా యతీల్లో చెత్త సేకరించే ట్రైసైకిళ్లను ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ శనివారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో వసంతకుమారి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 12:06 AM