Share News

Cooperate for the Census జనగణనకు సహకరించాలి

ABN , Publish Date - May 03 , 2026 | 12:07 AM

Cooperate for the Census జిల్లాలో ప్రారంభమైన మొదటి దశ జనగణనకు ప్రజలు సహకరించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. ఇంటింటికీ వచ్చే అధికారులకు పూర్తి సమాచారం ఇవ్వాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు.

Cooperate for the Census జనగణనకు సహకరించాలి

పార్వతీపురం, మే 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రారంభమైన మొదటి దశ జనగణనకు ప్రజలు సహకరించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. ఇంటింటికీ వచ్చే అధికారులకు పూర్తి సమాచారం ఇవ్వాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు. కుటుంబ యజమాని పేరు, ఇంటిలోని వ్యక్తుల పేర్లు, నివాస గృహంలో గదుల సంఖ్య, తాగునీరు, మరుగుదొడ్డి, విద్యుత్‌ సౌకర్యాలు, వంటగ్యాస్‌ వివరాలను ఎన్యూమరేటర్లు నమోదు చేయనున్నారని వెల్లడించారు. వారు అడిగే ప్రశ్నలకు జిల్లావాసులు పారదర్శకంగా సమాధానం ఇచ్చిన జనగణన ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సివిల్‌ పనులు వేగవంతం

రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ సివిల్‌ పనులను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం తన కార్యా లయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఆసుపత్రుల్లో విద్యుత్‌, జనరేటర్ల ఏర్పాటు, ప్రహరీల నిర్మాణంపై ఆరా తీశారు. కేవలం గణాంకాలు చెప్పడానికే కాకుండా క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలని సూచిం చారు. పనుల నాణ్యత, పురోగతిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐటీడీఏ పీవోలు వైశాలి, పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, డీఎంహెచ్‌వో నాగభూషణరావు తది తరులున్నారు.

Updated Date - May 03 , 2026 | 12:07 AM