Census జనగణనకు సహకరించాలి
ABN , Publish Date - Apr 26 , 2026 | 11:52 PM
Cooperate for the Census జనగణనకు ప్రతిఒక్కరూ సహాకరించాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆదివారం పట్టణంలో 5కే రన్ నిర్వహించారు.
ఉత్సాహంగా 5కే రన్
సాలూరు, ఏప్రిల్26(ఆంధ్రజ్యోతి): జనగణనకు ప్రతిఒక్కరూ సహాకరించాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆదివారం పట్టణంలో 5కే రన్ నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీ మున్సిపల్ కార్యాలయం నుంచి డీలక్స్ సెంటర్ వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ సేవలు మరింత సమర్థంగా అందించేందుకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రత్నకుమార్‌తో, టీడీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురంలో..
పార్వతీపురం టౌన్ : జనగణనపై ప్రజలకు చైతన్యం కలిగించేందుకు ఆదివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి 5కే రన్ చేపట్టారు. జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనగణన నిర్వహణకు తగు ప్రణాళికలను సిద్ధం చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. జనగణన అనేది కేవలం అంకెల సేకరణ మాత్రమే కాదని, దేశ భవిష్యత్తుకు బలమైన పునాది అని తెలిపారు. పౌరులు అందించే కచ్చితమైన సమాచారం ఆధారంగానే సంక్షేమ పథకాలు, భవిష్యత్ ప్రణాళికలు రూపొందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో కె.హేమలత, మున్సిపల్ కమిషనర్ డి.పావని, డీఈవో బ్రహ్మాజీరావు, తదితరులు పాల్గొన్నారు.