ప్రశాంత ఎన్నికలకు సహకరించండి: ఎస్పీ
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:40 AM
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు గ్రామాల్లోని ప్రజలు సహకరించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ కోరారు.
బొండపల్లి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు గ్రామాల్లోని ప్రజలు సహకరించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యం లో గురువారం గొట్లాం గ్రామంలో ఆయన ఓటర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు. ఓటు హక్కుకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఓట ర్లను ప్రలోభాలకు గురిచేసినట్టు పోలీసుల దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే రాజకీయ కక్షలతో ఎన్నికల్లో వివాదాలు జోలికి వెళ్లి అనవసరంగా కేసుల్లో ఇరుక్కొని జీవితాలను నాశనం చేసుకోద్దని ఆయన హితవు పలికారు. తహసీల్దార్ డోలా రాజేశ్వరావు, ఎంపీడీవో అరసాడ రఘపతిరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఏవీ లీలారావు, బొండపల్లి, గజపతినగరం ఎస్ఐలు యు.మహేష్, ఎ.సన్యాసి నాయుడు తదితరులు పాల్గొన్నారు.