మూడో రోజుకు వంటా-వార్పు
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:38 AM
పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించకపోవడం అన్యాయమని సీపీఐ శృంగవరపుకోట నియోజకవర్గ సమితి కార్యదర్శి గండేపల్లి భీముడు అన్నారు.
కొత్తవలస, మార్చి 27(ఆంధ్రజ్యోతి): పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించకపోవడం అన్యాయమని సీపీఐ శృంగవరపుకోట నియోజకవర్గ సమితి కార్యదర్శి గండేపల్లి భీముడు అన్నారు. 2018 సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం కొత్తవలస గ్రామ సర్వే నెంబరు 168, 173లలో అర్హులైన పేదలకు పట్టాలు మంజూరు చేసిందని, వీరికి ఇంతవరకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయకపోవడం అన్యాయమన్నారు. పట్టాలు ఇచ్చిన పేదలకు ఇళ్ల స్థలాలను చూపించాలంటూ గత మూడు రోజులుగా వంటా-వార్పు కార్యక్రమాన్ని చేపడుతున్న బాధితులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా అర్హులైన పేదలందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.
ఈనెల 17నే కలెక్టర్‌కు జాబితా పంపించా..
నెల రోజుల కిందటే విధుల్లో చేరాను. అయినప్పటికీ ఈ సమస్య నా వద్దకు రాకముందే గతంలో పట్టాలు మంజూరు చేసిన వారి జాబితాను ఈనెల 17వ తేదీన కలెక్టర్‌కు పంపించా. తాను పంపించిన జాబితాలో 2019-2024 మధ్య జగనన్న కాలనీలో లబ్ధిపొందితే.. అటువంటి వారిని తొలగించి, మిగిలిన వారికి ఇళ్ల స్థలాలు మంజూరు కోసం కృషి చేస్తున్నాం. ఈనెల 25 నుంచి వంటా-వార్పు అంటూ నిరసన వ్యక్తం చేయడం ఎంతవరకు న్యాయం.
- రామలక్ష్మి, తహసీల్దార్, కొత్తవలస