Share News

తహసీల్దార్‌పై కోర్టు ధిక్కరణ కేసు

ABN , Publish Date - Sep 23 , 2026 | 12:30 AM

కోర్టు ధిక్కరణ కేసులో తహసీల్దార్‌ రమణమ్మకు హైకోర్టు రూ.2వేలు జరిమానా విధించింది.

తహసీల్దార్‌పై కోర్టు ధిక్కరణ కేసు

  • రూ.2వేల జరిమానా విధించిన హైకోర్టు

  • పిటిషనర్‌కు రూ.10వేలు చెల్లించాలని ఆదేశం

అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): కోర్టు ధిక్కరణ కేసులో తహసీల్దార్‌ రమణమ్మకు హైకోర్టు రూ.2వేలు జరిమానా విధించింది. ఈ సొమ్మును రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌కు చెల్లించాలని స్పష్టం చేసింది. మరో వైపు ఖర్చుల కింద పిటిషనర్‌ కు రూ.10వేలు చెల్లించాలని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను తహసీల్దార్‌ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని పేర్కొంది. వివరాలివీ.. విజయనగరం జిల్లా, జామి మండలం, ఎం.కొత్తవలస గ్రామానికి చెందిన దిండి చంద్రరావుకు భోగాపు రం మండలం, రావివలస లోని సర్వే నంబరు 18/8లో 71సెంట్లు భూమి ఉంది. సివిల్‌ సూట్‌ పెండింగ్‌లో ఉందనే కారణంతో ఈ భూమికి సంబంధించి ఫారం-1(బి) పై డిజిటల్‌ సంతకం చేసేందుకు తహసీల్దార్‌ నిరాకరించ డంతో చంద్రరావు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు పిటిషనర్‌ కు డిజిటల్‌ సంతకంతో కూడిన ఫారం-1(బి) జారీ చేయాలని 2023 అక్టోబరు 18న తీర్పు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు అమలు కాకపోవడంతో చంద్రరావు 2024లో కోర్టుధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. సింగిల్‌ జడ్జి తీర్పుపై థర్డ్‌ పార్టీ అప్పీల్‌ పెండింగ్‌లో ఉందనే కారణంతో పిటిషనర్‌ దరఖాస్తును తిరస్కరిస్తూ తహసీల్దార్‌ రమణమ్మ ఎండార్స్‌మెంట్‌ ఇచ్చినట్లు గుర్తించారు. అప్పీల్‌లో ఎలాంటి స్టే ఉత్త ర్వులు లేనప్పటికీ కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని అభి ప్రాయపడ్డారు. ఈ మేరకు రూ.2వేల జరిమానా విధిస్తూ.. తీర్పు ప్రతి అందిన నాలుగు వారాల్లో సొమ్ము చెల్లించాలని ఆదేశించారు. విఫలమైతే వారం రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కోర్టుధిక్కరణ కిం ద సదరు అధికారిణికి జైలుశిక్ష విధించాల్సి ఉన్నప్పటికీ ఆమె వయస్సు(61) పరిగణనలోకి తీసుకొని ఉదారంగా వ్యవహరిస్తున్నామని తెలిపింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్య ఇటీవల తీర్పు ఇచ్చారు.

Updated Date - Sep 23 , 2026 | 12:30 AM