శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాల నిర్మాణం
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:41 PM
గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించాలని, భక్తుకు మౌలికవసతులు కల్పించడమే ధ్యేయంగా శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాలను నిర్మించనున్నట్లు శృంగవరపుకోట శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి తెలిపారు.
కొత్తవలస,(లక్కవరపుకోట) సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించాలని, భక్తుకు మౌలికవసతులు కల్పించడమే ధ్యేయంగా శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాలను నిర్మించనున్నట్లు శృంగవరపుకోట శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి తెలిపారు. కొత్తవలస మండలంలోని మిందివలస రామచంద్రపురం, రాజపాత్రునిపాలెంల్లో పురాతన ఆలయాల అభివృద్ధికి టీటీడీకి చెందిన శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధులు మంజూరుచేయడంతో బుధవారం ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేని కలిశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూమిందివలస రామచంద్రపురానికి చెందిన బంగారమ్మ తల్లి, రాజపాత్రునిపాలెం గ్రామానికి చెందిన రావాలమ్మతల్లి ఆలయాలకు ఒక్కో ఆలయానికి రూ.40 లక్షలు చొప్పున 80 లక్షల రూపాయలు మంజూరుచేసినట్లు తెలిపారు. ఈ నిధులతో ఆలయాలను త్వరితగతిని పూర్తిచేయడానికి కృషి చేయాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచన చేశారు.
రైతులకు ప్రభుత్వం తరఫున పరిహారం
జామి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): అగ్ని ప్రమాద బాధిత రైతులకు ప్రభుత్వం తరపున పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి హామీఇచ్చారు. మండలంలోని చింతాడలో జరిగిన అగ్ని ప్రమాదంలో పశువుల పాకలు, గడ్డివాములు, ధాన్యం పురుపులు నష్టపోయిన పాడి రైతులను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాధితులకు అండగా ఉంటానని తెలిపారు. రైతులకు పశువుల షెడ్లు మంజూరుచేస్తున్నట్లు ప్రకటించారు.