నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - Oct 01 , 2026 | 12:24 AM
నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యమని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు.
నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి
భోగాపురం, సెప్టెంబరు30(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యమని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. బుధవారం భోగాపురం పంచాయతీ కొల్లిపేటలో పల్లెపండగ కార్యక్రమంలో భాగంగా పీఆర్ బీటీ రోడ్డు నుంచి శ్మశానవాటిక వరకు సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
80 కుటుంబాలు జనసేనలో చేరిక
డెంకాడ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): మండలంలోని బంగార్రాజుపేటలో వైసీపీ నుంచి 80 కుటుంబాలకు చెందిన 150 మంది జనసేనలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి సమక్షంలో సాది ఈశ్వరరావు ఆధ్వర్యంలో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బంటుపల్లి వాసుదేవరావు, మండల క్లస్టర్ ఇన్‌చార్జి దాడిశెట్టి శ్రీని వాసరావు, తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు.
నెల్లిమర్ల, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): జరజాపుపేటలో బోలేఆశా దంపతుల ఆధ్వర్యంలో సుమారు 500 మంది జనసేనలో చేరారు. ఈ సందర్భంగా వారికి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి పార్టీలోకి ఆహ్వానించారు.