Share News

కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

ABN , Publish Date - Apr 29 , 2026 | 12:21 AM

మండలంలోని మదుపాడ జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఓ కానిస్టేబుల్‌ తీవ్రంగా గాయపడ్డారు.

కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

గజపతినగరం, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని మదుపాడ జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఓ కానిస్టేబుల్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌నాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గంట్యాడ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఎ.శ్రీనివాస రావు బొబ్బిలిలో జరిగే అమ్మవారి పండగకు బందోబస్తుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. పెదమానాపురం వైపు నుంచి వస్తున్న కారు మదుపాడ జంక్షన్‌ వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్‌ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహాయంతో 108 వాహనంలో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో జిల్లా కేంద్రంలోగల ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అందిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 29 , 2026 | 12:21 AM