Consecration of the Paidimamba Temple's Shikhara (Spire) పైడిమాంబ ఆలయ శిఖర ప్రతిష్ఠ
ABN , Publish Date - Jun 26 , 2026 | 12:07 AM
Consecration of the Paidimamba Temple's Shikhara (Spire) విజయనగరంలో పైడిమాంబ ఆలయ పునః నిర్మాణంలో భాగంగా గురువారం శిఖర ప్రతిష్ఠ మహోత్సవం గురువారం ఉదయం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 10.47 గంటలకు సింహ లగ్నంలో ఈ కార్యక్రమాన్ని సింహాచలం దేవస్థానం వేద పాఠశాల పండితులు తాళ్లపూడి సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో జరిపించారు.
పైడిమాంబ ఆలయ శిఖర ప్రతిష్ఠ
పాల్గొన్న గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు
విజయనగరం కల్చరల్, జూన్ 25(ఆంధ్రజ్యోతి): విజయనగరంలో పైడిమాంబ ఆలయ పునః నిర్మాణంలో భాగంగా గురువారం శిఖర ప్రతిష్ఠ మహోత్సవం గురువారం ఉదయం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 10.47 గంటలకు సింహ లగ్నంలో ఈ కార్యక్రమాన్ని సింహాచలం దేవస్థానం వేద పాఠశాల పండితులు తాళ్లపూడి సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో జరిపించారు. కార్యక్రమంలో గోవా రాష్ట్ర గవర్నర్ అశోక్ గజపతిరాజు దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శిఖర ప్రతిష్ఠకు సంబంధించిన క లశాలను పట్టుకుని యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం మెట్ల మార్గంలో ఆలయ శిఖరానికి వెళ్లి ప్రతిష్ఠ చేశారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతో పాటు కలెక్టరు రామసుందర్‌రెడ్డి, ఎస్పీ ఎఆర్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం యాగశాలలో పూర్ణాహుతి, అగ్ని ప్రదక్షిణ, ప్రాణ ప్రతిష్ఠ, కుంభ దర్శనం, గో దర్శనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో తొలి దర్శనం అశోక్, అనందగజపతిరాజు కుటుంబ సభ్యులు చేసుకున్నారు. దేవదాయశాఖ ఎసీ కె.శిరీష, ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావుతో పాటు ధర్మకర్తల మండలి సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.