Share News

హేమకు అభినందనలు

ABN , Publish Date - Jul 03 , 2026 | 12:14 AM

గుమ్మలక్ష్మీపురం ఆశ్రమ పాఠశాల సంరక్షకురాలు హేమను గురువారం గరుగుబిల్లిలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అభినందించారు.

 హేమకు అభినందనలు
హేమను అభినందిస్తున్న మంత్రి సంధ్యారాణి

గరుగుబిల్లి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): గుమ్మలక్ష్మీపురం ఆశ్రమ పాఠశాల సంరక్షకురాలు హేమను గురువారం గరుగుబిల్లిలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అభినందించారు. గుమ్మలక్ష్మీపురం మండలం వాడపుట్టికి చెందిన విద్యార్థిని భువనేశ్వరి జ్వరంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న హేమ... విద్యార్థినికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయడంపై మంత్రి సంధ్యారాణి అభినందించారు. రహదారి సౌకర్యం లేకున్నా సుమారు మూడు కిలోమీటర్లు కాలినడకన విద్యార్థినిని తీసుకెళ్లడంపై ప్రశంసించారు. విధులకే పరిమితం కాకుండా మానవత్వం చూపినందుకు కొనియాడారు. హేమను ఆదర్శంగా తీసుకుని సామాజిక సమ స్యలపై స్పందించాలని కోరారు. హేమను అభినందించిన వారిలో ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి, కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి, ఆర్డీవో కె.మాధురి తదితరులున్నారు.

Updated Date - Jul 03 , 2026 | 12:14 AM