Share News

విశ్వాసం పెరిగేలా సేవలు

ABN , Publish Date - Jul 18 , 2026 | 12:01 AM

ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెరిగేలా సేవలు అందిస్తామని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాఽధవి అన్నారు.

 విశ్వాసం పెరిగేలా సేవలు

  • ఎమ్మెల్యే నాగమాధవి

భోగాపురం, జూలై 17(ఆంధ్రజ్యోతి): ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెరిగేలా సేవలు అందిస్తామని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాఽధవి అన్నారు. శుక్రవారం ముంజేరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆమె ప్రజాదర్బార్‌ నిర్వహించి.. వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పని చేస్తామన్నారు. అనంతరం సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా మంజూరైన ఏడుగురికి రూ.5.66లక్షల విలువగల చెక్కులను అందజేశారు. నాయకుడు పల్లంట్ల జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2026 | 12:01 AM