Conducting a survey... but ignoring the problems.సర్వే చేసి.. సమస్యలు వదిలేసి
ABN , Publish Date - Jun 14 , 2026 | 12:11 AM
Conducting a survey... but ignoring the problems. గ్రామాల్లో భూ సమస్యలు, వివాదాలు లేకుండా చేయాలని 2020 డిసెంబరులో రీ సర్వేను చేపట్టామని గత ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఆచరణలో ఆ లక్ష్యం కనిపించలేదు. కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. అంతవరకూ ప్రశాంతంగా ఉన్న రైతులు రీసర్వే తర్వాత కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు. నేటికీ అవి పరిష్కారం కాక అవస్థలు పడుతున్నారు.
సర్వే చేసి.. సమస్యలు వదిలేసి
రీసర్వే గ్రామాల్లో రైతులకు అవస్థలు
జాయింట్ ఎల్‌పీఎంలతో తరచూ వివాదాలు
రెవెన్యూ అధికారులకు విన్నపాలు
పీజీఆర్‌ఎస్‌లోనూ వెల్లువెత్తున్న అర్జీలు
- విజయనగరం మండలం సిరియాలపేట రెనెన్యూ పరిధిలో సర్వే నెంబరు 35-3లో 71 సెంట్లను పిల్ల సూరప్పడు నుంచి 1993లో దొంతల సూర్యనారాయణ, సన్యాసప్పడు కొనుగోలు చేసుకున్నారు. అప్పటి నుంచి వీరు ఆ భూమిని సాగు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు కూడా పాస్ పుస్తకాలు మంజూరు చేశారు. అయినా గాని గత ప్రభుత్వ హయంలో జరిగిన రీసర్వే సమయంలో కె.బంగారయ్య పేరున ఆన్‌లైన్‌లో నమోదు చేసేశారు. సంబంధం లేని వ్యక్తిపేరున మార్పు చేయడంపై సూర్యనారాయణ, సన్యాసప్పడు మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. పరిష్కారం కాకపోవడంతో కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో పలు మార్లు విన్నవించుకున్నారు. అయినా పరిష్కారం కాలేదు.
- జామి మండలం వెన్నె రెవెన్యూ పరిధిలో గంట్యాడ మండలం వసంత గ్రామానికి చెందిన సీహెచ్ కృష్ణారావుకు రెండు సర్వే నెంబర్లలో కొంత భూమి ఉంది. వెన్నె గ్రామంలో రీ సర్వే అయిన తరువాత కృష్ణరావుకు రెండు సర్వే నెంబర్లుకు రెండు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేశారు. మంజూరు చేసిన పాస్ పుస్తకాల్లో తప్పులు ఉన్నాయి. ఒక పాస్ పుస్తకంలో రైతు ఫొటో కాకుండా వేరే మహిళ ఫొటో మద్రించారు. పరిష్కారం కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.
- గంట్యాడ మండలంలోని నరవ గ్రామంలో రీసర్వే ప్రక్రియ పూర్తి చేసి మూడు సంవత్సరాలు కావస్తోంది. ఇప్పటికీ చాలా సర్వే నెంబర్లు జాయింట్ ఎల్‌పీఎంలుగా ఉన్నాయి. విడదీయడానికి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారి పిల్లల పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం భూమిని విక్రయించుకుందామంటే కుదరక ఇబ్బంది పడుతున్నారు.
విజయనగరం కలెక్టరేట్, జూన్ 13(ఆంధ్రజ్యోతి):
గ్రామాల్లో భూ సమస్యలు, వివాదాలు లేకుండా చేయాలని 2020 డిసెంబరులో రీ సర్వేను చేపట్టామని గత ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఆచరణలో ఆ లక్ష్యం కనిపించలేదు. కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. అంతవరకూ ప్రశాంతంగా ఉన్న రైతులు రీసర్వే తర్వాత కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు. నేటికీ అవి పరిష్కారం కాక అవస్థలు పడుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా 983 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటిల్లో 2024 జూన్ వరకూ 519 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ జరిగింది. 509 గ్రామాల్లోని భూముల వివరాలను వెబ్‌ల్యాండ్-2లో చేర్చారు. ఈప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి విడతలో 27 గ్రామాలు, రెండో విడతలో 48 గ్రామాలు, మూడో విడతలో 366 గ్రామాలు, నాలుగో విడతలో 126 గ్రామాలు, ఐదో విడతలో 100 గ్రామాల్లో సర్వే జరిగింది. 423 గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,10,228 పట్టాదారు పాస్ పుస్తకాలు రాగా వీటిల్లో రెండు లక్షల పుస్తకాలు పంపిణీ చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే సర్వే పూర్తయిన గ్రామాల్లో అవే చిక్కులు ఉండిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా సర్వే పూర్తయిన చోట గతంలో ఉన్న విస్తీర్ణానికి ఇప్పటికీ తేడాలు ఉంటున్నాయి. కొన్ని సర్వే నెంబర్లలో నాలుగైదు సెంట్లు తక్కువగా వస్తున్నాయి. భూ యజమాని పేర్లు, అడ్రాస్‌లు, ఆధార్, ఫోన్ నెంబర్లు తేడాలు వస్తున్నాయి. వీటిని సరి చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు కానీ అవే ఉండిపోతున్నాయి.
- జాయింట్ ఎల్‌పీఎంలు ఎక్కువగా ఉన్నాయి. ఒక సబ్ డివిజన్‌లో ఉన్న రైతులందరికీ ఒకే విస్తీర్ణం నమోదై ఉంది. జాయింట్ ఎల్‌పీఎంలు జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్షా 7 వేల వరకూ ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. దీనివల్ల రైతులు తమ అవసరాల కోసం భూములను విక్రయించుకోలేపోతున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌లో భూ సమస్యలపైనే అఽఽధిక సంఖ్యలో వినతులు వస్తున్నాయి. రీసర్వే నిర్వహించినా సమస్యలు పరిష్కారం కాలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు.