రీ సర్వే పక్కాగా చేపట్టండి: ఆర్డీవో
ABN , Publish Date - Aug 01 , 2026 | 12:27 AM
భూముల రీ సర్వే పక్కాగా చేపట్టాలని ఆర్డీవో కె.మాధురి రెవెన్యూ అధికారులను ఆదేశించారు
మక్కువ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): భూముల రీ సర్వే పక్కాగా చేపట్టాలని ఆర్డీవో కె.మాధురి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ములక్కాయవలస గ్రామంలో చేపడుతున్న భూముల రీసర్వేను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రీసర్వే విధానం, ఫీల్డ్ కొలతలు, సరిహద్దు నిర్ధారణ, రికార్డుల నమోదు ప్రక్రియ, మ్యాపింగ్‌తో పాటు పలు రికార్డులను చూశారు. రీసర్వే పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ప్రతిదశలోను కచ్చితత్వానికి ప్రాధాన్యనివ్వాలన్నారు. ఈ విషయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే అందుబాటులోని అధికారికి తెలియపరిచాలన్నారు.