ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించండి
ABN , Publish Date - Nov 05 , 2026 | 12:08 AM
ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆర్డీవో రామ్మోహనరావు సిబ్బందిని ఆదేశించారు.
బొబ్బిలి రూరల్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆర్డీవో రామ్మోహనరావు సిబ్బందిని ఆదేశించారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో పోలింగ్ కేంద్రాల వారీగా బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, ఇతర ఎన్నికల అవసరమైన సామగ్రిని సిబ్బందికి అందజేస్తున్న ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు, సిబ్బంది విధులు, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారిం చాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను కచ్ఛితంగా పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. కార్య క్రమంలో ఎంపీడీవో పి.రవికుమార్, ఇన్‌చార్జి తహసీల్దార్ టీకేవీ సుబ్బా రావు, ఎన్నికల జోనల్ అధికారులు పాల్గొన్నారు.